శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా నటించిన ‘భళా తందనాన’ మే 6న విడుదల
- April 29, 2022హైదరాబాద్: ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. చిత్ర యూనిట్ ఈ వారం జోరుగా ప్రమోషన్లను ప్లాన్ చేస్తుంది.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులుని ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచింది.
కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయిత గా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ చిత్రానికి టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ అందించారు.
తారాగణం: శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా, రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు.
సాంకేతిక విభాగం:
దర్శకత్వం- చైతన్య దంతులూరి
నిర్మాత - రజనీ కొర్రపాటి
సమర్పణ: సాయి కొర్రపాటి
బ్యానర్: వారాహి చలనచిత్రం
సంగీతం - మణిశర్మ
ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్
డీవోపీ - సురేష్ రగుతు
స్టంట్స్: పీటర్ హెయిన్
ఆర్ట్ - గాంధీ నడికుడికార్
రచన - శ్రీకాంత్ విస్సా
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్