భారత్ కరోనా అప్డేట్
- April 30, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజువారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య నాలుగు వేలకు చేరువ అవుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,688 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,075,864 కు చేరింది. ఇందులో మొత్తం 4,25,33377 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో దేశంలో 50 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,23,803కి చేరింది. అదే సమయంలో 2755 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 18,684 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.74 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,88,89,90,935 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







