నిరుపేదలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసిన మైనారిటీ శాఖ, సెర్ప్ కమీషనర్ ఇంతియాజ్

- April 30, 2022 , by Maagulf
నిరుపేదలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసిన మైనారిటీ శాఖ, సెర్ప్ కమీషనర్ ఇంతియాజ్

విజయవాడ: నగరంలోని నిరుపేదల సుమారు 100  మందికి నిత్యావసర కిట్లను మైనార్టీ  శాఖ, సెర్ప్ కమిషనర్ AMD.ఇంతియాజ్ పంపిణీ చేసారు. శనివారం లబ్బీపేటలోని దర్శాగా ఏ ఇస్లామిక్ స్కూల్  పరిసరాల్లో ఉన్న పేదలకు కీట్లు పంపిణీ చేసి  తన ఉదారత చాటుకున్నారు. సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, తాసిల్దార్ శ్రీనివాస్, మునీర్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మునీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 75 వేల రూపాయలతో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులు కిట్లను పంపిణీ చేశారు. కిట్లలో రెండు కేజీలు గోధుమపిండి ,ఒక కేజీ పంచదార, మరో కేజీ సేమియా, ఐదు కేజీల సోనామసూరి బియ్యం, డ్రై ఫ్రూట్స్ వున్నాయి. 

నిరుపేదలు సంతోషంగా రంజాన్ పండుగ నిర్వహించుకునేందుకు ఈ నిత్యావసర కిట్టు ఉపయోగపడుతుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవారంతా నిరుపేదల పట్ల కూడా ఆలోచించాలని పవిత్ర గ్రంధం ఖురాన్ బోధిస్తుంది.ఆ సూక్తిని ప్రేరణగా తీసుకున్న ఇంతియాజ్ పేదలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. నిత్యవసర కిట్లను ఆయన గత రంజాన్ మాసంలో కూడా పంపిణీ చేసారు. అదే పరంపరను కొనసాగిస్తూ ప్రస్తుత రంజాన్ లో కూడా కిట్లను పంపిణీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com