నిరుపేదలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసిన మైనారిటీ శాఖ, సెర్ప్ కమీషనర్ ఇంతియాజ్
- April 30, 2022
విజయవాడ: నగరంలోని నిరుపేదల సుమారు 100 మందికి నిత్యావసర కిట్లను మైనార్టీ శాఖ, సెర్ప్ కమిషనర్ AMD.ఇంతియాజ్ పంపిణీ చేసారు. శనివారం లబ్బీపేటలోని దర్శాగా ఏ ఇస్లామిక్ స్కూల్ పరిసరాల్లో ఉన్న పేదలకు కీట్లు పంపిణీ చేసి తన ఉదారత చాటుకున్నారు. సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, తాసిల్దార్ శ్రీనివాస్, మునీర్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మునీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 75 వేల రూపాయలతో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులు కిట్లను పంపిణీ చేశారు. కిట్లలో రెండు కేజీలు గోధుమపిండి ,ఒక కేజీ పంచదార, మరో కేజీ సేమియా, ఐదు కేజీల సోనామసూరి బియ్యం, డ్రై ఫ్రూట్స్ వున్నాయి.
నిరుపేదలు సంతోషంగా రంజాన్ పండుగ నిర్వహించుకునేందుకు ఈ నిత్యావసర కిట్టు ఉపయోగపడుతుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవారంతా నిరుపేదల పట్ల కూడా ఆలోచించాలని పవిత్ర గ్రంధం ఖురాన్ బోధిస్తుంది.ఆ సూక్తిని ప్రేరణగా తీసుకున్న ఇంతియాజ్ పేదలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. నిత్యవసర కిట్లను ఆయన గత రంజాన్ మాసంలో కూడా పంపిణీ చేసారు. అదే పరంపరను కొనసాగిస్తూ ప్రస్తుత రంజాన్ లో కూడా కిట్లను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







