బ్రస్సెల్స్‌ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు సిద్దమైన బాహుబలి..
- April 05, 2016
బాహుబలి చిత్రాన్ని ఇండియన్ ప్రేక్షకులే కాదు ప్రక్క దేశస్థులు కూడా మరింతగా ఆదరిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం 63వ జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రంగా నిలిచి అందరిని ఆశ్యర్యపరచింది. ఇక ప్రస్తుతం ఈ చిత్రం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు సిద్దమైంది.బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని ఏప్రిల్ 6 సాయంత్రం రాత్రి 10.30 నిమిషాలకు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పలు ఫిలింఫెస్టివల్‌లో ప్రదర్శితమై వీక్షకులకు కనువిందు కలిగించింది. తాజాగా బ్రస్సెల్స్‌లోను ఈ చిత్రం ప్రదర్శితం కానుండడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. బాహుబలి ది బిగినింగ్‌కు కొనసాగింపుగా బాహుబలి ది కంక్లూజన్ చిత్రం తెరకెక్కుతుండగా, వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉంది.రానా, ప్రభాస్, అనుష్కల మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







