దుబాయ్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే మూసివేత...విమానాల మళ్లింపు

- May 05, 2022 , by Maagulf
దుబాయ్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే మూసివేత...విమానాల మళ్లింపు

దుబాయ్: మే 9 నుండి జూన్ 22 వరకు విస్తృతమైన అప్‌గ్రేడేషన్ పనుల కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) ఉత్తర రన్‌వేను మూసివేయనున్నారు. దీంతో 1,000 కంటే ఎక్కువ విమానాలను దుబాయ్ వరల్డ్ సెంట్రల్, షార్జా విమానాశ్రయాలకు మళ్లించనున్నారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుండి వచ్చిన సమాచారాన్ని వెల్లడిస్తూ దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ బుధవారం తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దుబాయ్‌లోని ఉత్తర రన్‌వే మూసివేత కారణంగా కొన్ని విమానాలు దుబాయ్ విమానాశ్రయం నుండి అల్ మక్తూమ్ దుబాయ్ (డిడబ్ల్యుసి) విమానాశ్రయం, షార్జా విమానాశ్రయానికి మళ్లించబడతాయని, మే, జూన్ 2022లో కార్యకలాపాలలో తాత్కాలిక మార్పులు ఉంటాయని, ఫ్లైట్ షెడ్యూల్‌లో మార్పులు ఉండవచ్చని, కొత్త షెడ్యూల్ కోసం http://blog.airindiaexpress.inని సందర్శించాలని అందులో కోరింది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ గ్రిఫిత్స్ 45 రోజుల ఉత్తర రన్‌వే మూసివేతపై  స్పందించారు. ఈద్ విరామం తర్వాత, బిజీగా ఉండే వేసవి కాలానికి ముందు ఇతర సమయాల కంటే ట్రాఫిక్ సంఖ్య కొంచెం తక్కువగా ఉండే కాలంలో రన్ వే అప్‌గ్రేడేషన్ పనులను పెట్టుకున్నామన్నారు. విమానయాన భద్రత మా ప్రాథమిక లక్ష్యం అన్న ఆయన.. ఈ సమయంలో 1000కి పైగా విమానాలను ఇతర ఎయిర్ పోర్టులకు మళ్లించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com