'శేఖర్' ట్రైలర్ వచ్చేసింది..!
- May 05, 2022హైదరాబాద్: రాజశేఖర్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మూవీ శేఖర్.. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ''పోలీస్ యూనిఫామ్ వేసుకొని కూడా డ్యూటీ చేయని వాళ్లు చాలామంది ఉంటారు. అదే, పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణాలిచ్చే వాళ్లు వేలల్లో ఒక్కరే ఉంటారు'' అంటూ సమీర్ చెప్పే డైలాగ్ తో మొదలైన శేఖర్ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. రాజశేఖర్ యంగ్ అండ్ ఓల్డ్ లుక్స్ లో ఈ సినిమాలో కనిపించనున్నారు.. ఆయన కూతురు శివాని ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ ఐన 'జోసెఫ్' సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గారం వెంకట శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..