ఒమిక్రాన్ లోనే మరిన్ని ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయి: WHO
- May 05, 2022
జెనీవా: ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెట్టిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్ లోనే మరిన్ని ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. చాలా దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ2 ప్రభావమే ఎక్కువగా ఉన్నా.. దక్షిణాఫ్రికాలో మాత్రం బీఏ 4, బీఏ 5 అనే కొత్త ఉపరకాలు కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ అన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో.. ఏమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
వైరస్ ఎలా మారుతోందో..ఏంటో కూడా తెలియడం లేదన్నారు. చాలా దేశాలు వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడాన్ని ఆపేశాయని, కానీ, దక్షిణాఫ్రికా ఇంకా కొనసాగిస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే రెండు కొత్త ఉప రకాలను గుర్తించగలిగామని అన్నారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా నిబంధనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా గత వారంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయని డబ్ల్యూహెచ్ వో నివేదిక వెల్లడించింది. గత వారం 15 వేల మంది చనిపోయారని, ఈ సంఖ్య కరోనా ప్రారంభ రోజుల కన్నా తక్కువని చెప్పింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







