షార్జా: సముద్రంలో మునిగి భారతీయ వ్యక్తి మృతి!
- May 05, 2022
షార్జా: షార్జాలో రంజాన్ పండుగ పూట ఓ భారతీయ కుటుంబంలో విషాదం అలుముకుంది.అక్కడి హమ్రియా సముద్రంలో సరదాగా ఈతకు వెళ్లిన 24 ఏళ్ల భారత యువకుడు నీట మునిగి చనిపోయాడు.మృతుడిని కేరళ రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలోని గురువాయూర్‌కు చెందిన ముహమ్మద్ ఎమిల్‌గా గుర్తించారు.అతడు ఫుజైరాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.ఈద్ వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర తీరానికి వెళ్లిన ఎమిల్.. సరదాగా ఈత కొడుతున్న సమయంలో లోపలికి కొట్టుకుపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతడి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న షార్జా పోలీసులు ఎమిల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీలో ఉంచామని, లాంఛనాలు పూర్తయిన తర్వాత స్వగ్రామానికి తీసుకువస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







