గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్‌ లో ట్యాంపరింగ్...కార్మికులు అరెస్ట్

- May 06, 2022 , by Maagulf
గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్‌ లో ట్యాంపరింగ్...కార్మికులు అరెస్ట్

జెడ్డా: గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్‌లను ట్యాంపరింగ్ చేస్తున్న పలువురు ప్రవాస కార్మికులను అధికారులు అరెస్ట్ చేశారు. వారిపై దేశ బహిష్కరణ వేటు వేయాలని భద్రతా అధికారులకు రిఫర్ చేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఇంధన మంత్రిత్వ శాఖ, సౌదీ స్టాండర్డ్స్, మెట్రాలజీ మరియు క్వాలిటీ ఆర్గనైజేషన్ (SASO) సంయుక్తంగా అనేక గ్యాస్ స్టేషన్‌లను తనిఖీ చేసింది. ఈ సందర్భంగా ఓ గ్యాస్ స్టేషన్‌లో చట్టవిరుద్ధమైన పద్ధతులను అనుసరించినట్లు గుర్తించారు. కొంతమంది కార్మికులు గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్‌లతో టింకరింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోల వైరల్ కావడంతో అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. వాణిజ్యం, ఇంధన మంత్రిత్వ శాఖలు, SASO సహకారంతో తూర్పు ప్రావిన్స్, జెడ్డా గవర్నరేట్‌లోని నిర్దిష్ట గ్యాస్ స్టేషన్‌లలో తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com