దుబాయ్‌లో ఘనంగా ఠాగూర్ 161వ జయంతి ఉత్సవాలు
- May 08, 2022
దుబాయ్: రవీంద్రనాథ్ ఠాగూర్ 161వ జయంతిని దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా 'ఠాగూర్ బియాండ్ హారిజోన్' అనే ఆల్బమ్‌లోని 3 ఐకానిక్ పాటలను విడుదల చేశారు. ఠాగూర్ రాసిన మూడు పాటలను అరబిక్లోకి అనువదించి అందించడం ఇదే తొలిసారి. ప్రముఖ ఎమిరాతి కవి డాక్టర్ షిహాబ్ ఘనేమ్ వీటిని అనువాదం చేశారు.దేవ్ చక్రవర్తి పాటలకు స్వరాలను అందించారు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ సుచేత సతీష్ అరబిక్ లో గానం చేశారు. భారత కాన్సులేట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అమన్ పూరి ఈ పాటలను విడుదల చేశారు. కాన్సుల్ ఫర్ కల్చర్ తాడు మాము ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. డాక్టర్ ఘనేమ్, దేవ్, సుచేత త్రయం ఇప్పటికే ఠాగూర్ పాటలను అరబిక్లోకి అనువదించే ప్రాజెక్టుపై పని చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో యూఏఈ, ఇండియా నుండి ప్రముఖ వ్యక్తులు మరియు ఇండియన్ పీపుల్స్ ఫోరంకు సంబంధించిన ప్రదీప్ మురళి,సుమీత, కుంభాల మహేందర్ రెడ్డి, శివ కుమార్ మరియు ఇండియన్ కౌన్సిల్ కు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







