మహిళలతో బలవంతంగా వ్యభిచారం. నిందితుల జైలు శిక్షను సమర్థించిన కోర్టు

- May 09, 2022 , by Maagulf
మహిళలతో బలవంతంగా వ్యభిచారం. నిందితుల జైలు శిక్షను సమర్థించిన కోర్టు

బహ్రెయిన్: మానవ అక్రమ రవాణా కేసులో తమకు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను సవాలు చేసిన ఇద్దరు వ్యక్తుల జైలు శిక్షలను హైకోర్టు అప్పీలు కోర్టు సమర్థించింది. ఇద్దరు బాలికలను అక్రమ రవాణా చేసి, నకిలీ ఉద్యోగ ఆఫర్లతో ప్రలోభపెట్టి వారిని వ్యభిచారంలోకి దింపినందుకు సదరు వ్యక్తులను కోర్టు దోషులుగా తేల్చింది. జైలు శిక్ష పూర్తయిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఆసియాకు చెందిన ఓ మహిళ తమ సొంతూరుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను వెయిట్రెస్ లుగా పని చేసేందుకు బహ్రెయిన్ రప్పించింది. అనంతరం వారి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకొని వారిని ఓ అపార్టుమెంట్ లో బంధించింది. తాను చెప్పినట్లు వ్యభిచారం చేయకపోతే సొంతూర్లో పరువు తీస్తానని చెప్పి బాధితులను బెదిరించి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది. శిక్ష పడ్డ మరో వ్యక్తి కస్టమర్లను తీసుకొచ్చేవాడు. పోలీసులకు ఫోన్ చేసే అవకాశం దొరికే వరకు బాధితుల కష్టాలు కొనసాగాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులపై మానవ అక్రమ రవాణా, బాధితులను వ్యభిచారంలోకి నెట్టడం, వ్యభిచార గృహాన్ని స్థాపించడం, నిర్వహించడం వంటి అభియోగాలు మోపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com