పాక్ సైనిక స్థావరాలను అమెరికా అడిగింది: ఇమ్రాన్ ఖాన్
- May 09, 2022
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా పాకిస్థాన్ ప్రవాస పౌరులను ఉద్దేశించి ఓ వీడియో సందేశం వెలువరించారు. పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న అమెరికా డిమాండ్ కు తాను ఎప్పుడూ తలొగ్గలేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు వైదొలిగాక, పాక్ సైనిక స్థావరాలను అమెరికా కోరిందని, కానీ తాను అధికారంలో ఉన్నంత వరకు అందుకు ఒప్పుకోలేదని అన్నారు.
“ఆఫ్ఘనిస్థాన్ లో మళ్లీ ఉగ్రవాదం పేట్రేగితే తక్షణమే స్పందించేందుకు వీలుగా పాక్ లోని సైనిక స్థావరాలను ఉపయోగించుకుంటామని అమెరికా కోరింది. కానీ అమెరికా ప్రతిపాదన నాకు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా అనిపించలేదు. ఉగ్రవాదంపై అమెరికా పోరులో 80 వేల మంది వరకు పాకిస్థానీలు ప్రాణాలు కోల్పోయారు. కానీ పాక్ ప్రజల త్యాగాలను ఎప్పుడూ అభినందించకపోగా, అమెరికా రాజకీయవేత్తలు మనల్నే తప్పుబడుతున్నారు. ఇప్పటికే దేశంలోని గిరిజన ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పుడు మన సైనిక స్థావరాలు అడుగుతున్నారు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించలేదు” అని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







