ఎక్కువ మంది హజ్‌కు వెళ్లడానికి అవకాశం కల్పించాలి : కేసిఆర్

ఎక్కువ మంది హజ్‌కు వెళ్లడానికి అవకాశం కల్పించాలి : కేసిఆర్

రాష్ట్రం నుంచి ప్రతీ సంవత్సరం వేలాది ముస్లింలు పవిత్ర మక్కా నగరంకు హజ్ యాత్రకు వెళ్తోన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోటా పెంచాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో 44.74 లక్షల మంది ముస్లింలు ఉన్నారని, హజ్ యాత్రకు వెళ్లేందుకు 17 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకుంటే కేవలం 2532 మందికి మాత్రమే కోటా కేటాయిస్తున్నారని తెలిపారు. దీంతో మిగతా వారు చాలా మంది అసంతృప్తికి గురవుతున్నారని వివరించారు. రాష్ట్రం నుంచి కనీసం 4500 మందిని హజ్‌కు వెళ్లడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

Back to Top