కార్మికులకు నిరుద్యోగ బీమా: యూఏఈ

- May 10, 2022 , by Maagulf
కార్మికులకు నిరుద్యోగ బీమా: యూఏఈ

యూఏఈ: కార్మికులకు యూఏఈ నిరుద్యోగ బీమా పథకాన్ని ప్రకటించింది. సోమవారం యూఏఈ  క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఈ పథకాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు. నిరుద్యోగ బీమా పథకం కింద అకస్మాత్తుగా అతని/ఆమె ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి పరిమిత కాలానికి నగదు మొత్తం అందుతుందని ట్వీట్ లో చెప్పారు. బీమా ప్యాకేజీల ద్వారా ఈ వ్యవస్థను అమలు చేయనున్నారు. బీమా పొందిన ఉద్యోగి అతను లేదా ఆమెకు మరొక ఉద్యోగం వచ్చే వరకు కొంత కాలం పాటు పరిహారం ఈ పథకం కింద అందజేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com