మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్‌ల అద్దెకు 41 మిలియన్ దినార్లు

- May 10, 2022 , by Maagulf
మైక్రోసాఫ్ట్  ప్రోగ్రామ్‌ల అద్దెకు 41 మిలియన్ దినార్లు

కువైట్: మైక్రోసాఫ్ట్  ప్రోగ్రామ్‌ల అద్దెకు 41 మిలియన్ దినార్లుగా నిర్ణయించారు. ఈ మేరకు సెంట్రల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్‌లు, లైసెన్స్ లను అన్ని ప్రభుత్వ సంస్థలకు అందజేయనున్నట్లు.. నిర్వహణ, సాంకేతిక మద్దతు, ఇతర సేవలను 41 మిలియన్ దినార్ల విలువతో అందుతాయని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్‌లు, లైసెన్స్ లు 3 సంవత్సరాల పాటు అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు సేవలు అందిస్తాయి. ఈ ఒప్పందం స్థానిక కంపెనీతో సంతకం చేయబడుతుందని, మైక్రోసాఫ్ట్ నుండి సరఫరా ప్రక్రియను ఆ సంస్థ నిర్వహిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com