రానున్న రెండు రోజుల్లో తెలంగాణకు వర్ష సూచన
- May 10, 2022హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అసని తుఫాను ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫానుకు తోడు తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది.
దీంతో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. మంగళవారం నగరంలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం