కీర్తి సురేష్ గ్లామర్ బొమ్మ అయిపోతుందా.?
- May 13, 2022
కీర్తి సురేష్.. ఈ పేరు చెప్పగానే ‘మహానటి’ సినిమానే గుర్తొస్తుంది. ఆ సినిమాలో ఆమె నట విశ్వరూపమే గుర్తుకొస్తుంది. అందుకే ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ తన పేరుకు ముందు మహానటి అనే బిరుదును తగిలించేసుకుంది.
‘నేను శైలజ’ సినిమాతో తెరంగేట్రం చేసి, తనదైన యాక్టింగ్ టాలెంట్‌తో తొలి సినిమాకే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మహానటి’ సినిమాతో నటిగా చెరిగిపోని ముద్ర వేయించుకుంది. గ్లామర్‌కి దూరంగా యాక్టింగ్ స్కోపున్న పాత్రలకే కీర్తి సురేష్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతూ వచ్చిందింతవరకూ.
అయితే, ‘సర్కారు వారి పాట’ సినిమాతో కీర్తి సురేష్‌లో కంప్లీట్ మేకోవర్ని గుర్తించారు అభిమానులు. అందుకే ఈ సినిమాతో కీర్తి సురేష్ గ్లామర్ ముచ్చట ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చింది. ఇక నుంచి కీర్తి సురేష్‌ని గ్లామర్ డాళ్‌గా కూడా చూసే అవకాశాలు లేకపోలేదు.. అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
అవునా.? నిజంగానే ‘సర్కారు వారి పాట’ సినిమాతో కీర్తి సురేష్ ఇమేజ్ మారిపోనుందా.? అంటే అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో వున్న సినిమాలు కూడా యాక్టింగ్ స్కోపున్న సినిమాలే. కానీ, ఇకపై ఆమె సైన్ చేయబోయే సినిమాలకు గ్లామర్ టచ్ ఇవ్వబోతోందని తెలుస్తోంది.
మరి, మహానటి కిరీటం ధరించిన కీర్తి సురేష్ గ్లామర్ డాళ్ ఇమేజ్‌ని స్వాగతించినట్లేనా.? గ్లామర్ డాళ్‌గా ఆమె అభిమానులు కీర్తి సురేష్‌ని అంగీకరిస్తారా.? మరోవైపు ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి పాత్రకు ఒకింత విమర్శలతో కూడిన ప్రశంసలు దక్కుతున్నాయ్. ఫస్ట్ డే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా, మిక్స్డ్ టాక్‌తో రన్ అవుతోంది ప్రస్తుతం ఈ సినిమా.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







