మహేష్ అలా.. అడవి శేష్ ఇలా.. కెలుక్కుంటున్నారెందుకబ్బా.!
- May 13, 2022
‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ నన్ను భరించలేదంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యల ద్వారా బాలీవుడ్‌కి మహేష్ టార్గెట్ అయిపోయాడంటూ ప్రచారం కూడా జరిగుతోంది. ఇదిలా వుంటే, టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ హాలీవుడ్‌ని కెలికాడు తాజాగా.
హాలీవుడ్ హీరోలా కనిపిస్తావ్ కదా.. అమెరికాలోనే పుట్టి పెరిగారు కదా.. ఎందుకు హాలీవుడ్ సినిమాల్లో నటించే సాహసం చేయలేదు.? అని ఓ ఇంటర్వ్యూలో అడవి శేష్‌ని ప్రశ్నించారట. ఆ ప్రశ్నకు సమాధానంగా అడవి శేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
హాలీవుడ్లో ఇండియన్ ఆర్టిస్టులను చాలా చీప్‌గా చూస్తారనీ, టెర్రరిస్టు పాత్రలూ లేదంటే, పెట్రోల్ బంక్‌లో పని చేసే తరహా పాత్రలనే ఇస్తారనీ చెప్పుకొచ్చాడు. ఇండియన్ అనేవాడు అమెరికాలో హీరో అవడం సాధ్యం కాదనీ తేల్చేశాడు అడవి శేష్. అంతేకాదు, అక్కడ పాపులర్ అయిన ఇండియన్ ఆర్టిస్టులంతా కేవలం కమెడియన్ రోల్స్‌కే పరిమితమయ్యారని కూడా వ్యాఖ్యానించాడు.
ఎందుకింతలా అడవి శేష్ హాలీవుడ్‌ని కెలుక్కున్నాడో ఏమో కానీ, ఆయన తాజా చిత్రం ‘మేజర్’ జూన్ 3న విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సినిమాని మహేష్ బాబు తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కేరళకు చెందిన రక్షణ శాఖ అధికారి సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవిత గాధ ఆధారంగా రూపొందుతోంది.
బహుశా ఈ సినిమాకి స్పెషల్ పబ్లిసిటీ అద్దాలన్న ఆలోచనతోనే హాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు కాబోలు అడవి శేష్. ఏదైతేనేం, అడవి శేష్ వ్యాఖ్యలు ఒకింత ఇంట్రెస్టింగ్‌గానే వున్నాయ్. కానీ, ఎవరి మనో భావాలూ దెబ్బ తినకుండా వుండాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







