షేక్ మొహమ్మద్ హయాంలో మరింత పురోగతి: బహ్రెయిన్
- May 15, 2022
మనామా: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఎన్నిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అభివృద్ధి, పురోగతికి తొడ్పడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్-జయానీ అన్నారు. ఇది సంయుక్త గల్ఫ్, అరబ్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో యూఏఈ సమర్థవంతమైన విదేశాంగ విధానం కొనసాగింపుగా నిలుస్తుందన్నారు. బహ్రెయిన్-ఎమిరాటీ సంబంధాలు స్నేహపూర్వకత , పరస్పర గౌరవం, దృఢమైన పునాదుల ఆధారంగా పటిష్టమైన, విశిష్టమైన వ్యూహాత్మక భాగస్వామ్యం, మరింత స్థిరమైన సమీకృత విజయాల కొత్త శకం వైపు బలం, ఆశావాదంతో ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భద్రత, స్థిరత్వం, శ్రేయస్సును కొనసాగించాలని ఆకాంక్షిస్తూ తన దేశాన్ని జాతీయంగా, ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా విజయాలు సాధించడంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విజయం సాధించే సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







