హజ్ కోసం దరఖాస్తు చేసుకున్న 23,474 మంది
- May 16, 2022
మస్కట్: ఈ సంవత్సరం మొత్తం 23,474 మంది హజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఒమానీల నుండి 21,429 దరఖాస్తులు రాగా.. నివాసితుల నుండి 2,045 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది సుల్తానేట్కు మంజూరు చేసిన 6,388 కోటాకు ఇది దాదాపు నాలుగు రెట్లు అధికం కావడం విశేషం. దఖ్లియా గవర్నరేట్లో అత్యధికంగా 4,008 దరఖాస్తులు రాగా, ముసందమ్ గవర్నరేట్లో అత్యల్పంగా 191 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుదారులలో 14,037 మంది పురుషులు, 9,437 మంది మహిళలు ఉన్నారు. ఈ-రిజిస్ట్రేషన్ మే 9న ప్రారంభమై మే 14న ముగిసింది. కొనసాగుతున్న COVID-19 మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం హజ్ కోసం సుల్తానేట్ కోటాను 45 శాతం తగ్గించినట్లు అవ్కాఫ్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









