అనసూయ భరద్వాజ్.. ఆ ‘ఏజ్’ ఏంటీ.? మాటల్లో ఆ ‘గేజ్’ ఏంటీ.?
- May 16, 2022
50 ఏళ్లొచ్చినా అనసూయ కత్తిలానే వుందని అందరూ అనుకోవాలట..’ ఈ మాట ఎవరో అంటున్నది కాదు, స్వయానా అనసూయ భరద్వాజ్ ఓ యాంకర్‌తో అంటున్న మాట. ఓ టీవీ షోలో ఏదో సందర్భంలో అనసూయ నోటి నుండి వచ్చిన మాట ఇది.
నిజమే, అనసూయకు తక్కువ వయసేం లేదు. ‘ఎంత’ అని మాత్రం అడక్కండి. కానీ, వయసు మాత్రం నాలుగు పదులంటూ గత పదేళ్లుగా ప్రచారం జరుగుతోందనుకోండి. తాజాగా అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె వయసు మరోసారి సోదిలోకి వచ్చింది.
వయసు ఎంతైతే మాత్రం. అప్ కమింగ్ హీరోయిన్లకు సైతం గ్లామర్ పరంగా పోటీ ఇవ్వగల సత్తా వుంది అనసూయలో. ఇటు బుల్లితెరపైనే కాదు, అటు పెద్ద తెరపైనా అనసూయ హవా అంతలా నడుస్తోంది మరి. ‘పుష్ప’లో విలన్ పాత్రలో కనిపించినా, ‘క్రాక్’లో దాదాపు హీరోయిన్లకు పోటీగా గ్లామర్ దాడి చేసినా అది అనసూయకు మాత్రమే చెల్లింది మరి.
అలాంటప్పుడు అనసూయ వయసు గురించిన చర్చ అనవసరమే కదా. అనసూయ విషయంలో ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. అది ఆమెకు ఎప్పుడూ అడ్డంకి కాలేదు. బుల్లితెరపై ఎంత బిజీగా వున్నా, పెద్ద తెరపై వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూనే వుంది అనసూయ.
ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయ్. అలాగే బుల్లితెరపైనా అనసూయ ఎప్పుడూ ఫుల్ బిజీనే. ఇక సోషల్ మీడియాలో అనసూయ గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. కుప్పలు తెప్పలుగా అనసూయకు ఫాలోవర్లున్నారు. దటీజ్ అనసూయ.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







