దుబాయ్ మినహా నివాసితులకు ప్రత్యేక ఐడీ సేవలు బంద్
- May 17, 2022
దుబాయ్: దుబాయ్ మినహా అన్ని వర్గాల నివాసితుల కోసం ప్రత్యేక ఎమిరేట్స్ ఐడీ జారీ/పునరుద్ధరణ సేవలను నిలిపివేస్తున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ & సెక్యూరిటీ పోర్ట్స్ (ICA) ప్రకటించింది. రెసిడెన్సీ, ఐడీ పునరుద్ధరణ కోసం ఏకీకృత ఫారమ్ సేవలు ఉపయోగించబడతాయని పేర్కొంది. ప్రస్తుతం ప్రత్యేక గుర్తింపు అభ్యర్థన ప్రక్రియలో ఉన్న వారికి మాత్రమే ప్రత్యేక నివాస సేవలు (ఇష్యూ/పునరుద్ధరణ) అందుబాటులో ఉంటాయని ఐసీఏ స్పష్టం చేసింది. యూఏఈ నివాసితుల కోసం రెసిడెన్సీ స్టిక్కర్ జారీని ఏప్రిల్ 11 నుండి నిలిపివేశారని, రెసిడెన్సీ, ఐడీ కార్డ్ జారీ, పునరుద్ధరణ కోసం వ్యక్తిగత అభ్యర్థనల స్థానంలో కొత్త ఏకీకృత సర్వీసును ప్రారంభించినట్లు ఐసీఏ తెలిపింది. ఐసీఏ వెబ్సైట్ www.icp.gov.ae లేదా UAEICP స్మార్ట్ యాప్ ద్వారా వ్యక్తిగత లేదా వ్యాపార ఖాతా ద్వారా ఎలక్ట్రానిక్‌గా వారి నివాస వివరాలను ప్రింట్ తీసుకోవడానికి ఐసీఏ ఐదు దశల ప్రక్రియను అమలు చేస్తోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







