ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ

- May 21, 2022 , by Maagulf
ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ

రియాద్: ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు తప్పనిసరి అని సౌదీ మానవ వనరులు,  సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్యోగి కాంట్రాక్ట్ వ్యవధి అపరిమితంగా ఉండి నెలవారీ వేతనం పొందినట్లయితే, కనీసం 60 రోజుల ముందుగానే వర్క్ కాంట్రాక్ట్ ను రద్దు చేయాలనే ఉద్దేశాన్ని ఉద్యోగి తప్పనిసరిగా యజమానికి తెలియజేయాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగి తన వేతనాన్ని నెలవారీగా పొందని సందర్భంలో 30 రోజుల కంటే తక్కువ వ్యవధిలో ఒప్పందం రద్దు గురించి యజమానికి తెలియజేయాలని తెలిపింది. కార్మికుడితో కాంట్రాక్టు సంబంధాన్ని రద్దు చేసుకుంటే యజమానికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.  రెండు పార్టీల మధ్య ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత ఉద్యోగి లేదా యజమాని పరిహారం పొందేందుకు అర్హులైన మూడు పరిస్థితులను స్పష్టం చేసింది. చట్టబద్ధమైన కారణంతో కాంట్రాక్టును రద్దు చేసిన సందర్భంలో పార్టీలలో ఒకరు నోటీసు వ్యవధిని పాటించనట్లయితే, నోటీసు వ్యవధిలో కార్మికుని వేతనానికి సమానమైన మెటీరియల్ పరిహారం బాధిత పార్టీకి చెల్లించబడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక చట్టవిరుద్ధమైన కారణంతో కాంట్రాక్ట్ రద్దు చేయబడి, నిర్దిష్ట పరిహారాన్ని కలిగి ఉండకపోతే.. కాంట్రాక్ట్ వ్యవధి పరిమితం అయినట్లయితే, కాంట్రాక్ట్ ప్రకారం మిగిలిన కాలానికి ఉద్యోగి వేతనాల వద్ద అంచనా వేసిన మెటీరియల్ పరిహారం చెల్లించబడుతుందని మంత్రిత్వ శాఖ సూచించింది.  పరిహారం రెండు నెలల వేతనం కంటే తక్కువగా ఉండకూడదని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com