వాక్-ఇన్ పాస్‌పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్

- May 21, 2022 , by Maagulf
వాక్-ఇన్ పాస్‌పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్

దుబాయ్: మే 22 నుండి వరుసగా రెండు ఆదివారాల్లో వాక్-ఇన్ పాస్‌పోర్ట్ సేవా శిబిరాలను దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. మే 29న రెండవ శిబిరం నిర్వహించబడుతుంది. దుబాయ్, షార్జాలోని నాలుగు బీఎల్ఎస్ (BLS) ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ సెంటర్లలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరుగనుంది. భారతీయ ప్రవాసుల నుండి అత్యవసర పాస్‌పోర్ట్ సంబంధిత సేవలను అందించడానికి పాస్‌పోర్ట్ సేవా శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు ఆన్‌లైన్ లో పూర్తి చేసిన దరఖాస్తును నాలుగు సెంటర్ల వద్ద సమర్పించవచ్చని ఇండియన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. అత్యవసర కేసుల్లో వైద్య చికిత్స, మరణం, పాస్‌పోర్ట్ ల గడువు ముగియడం(జూన్ 30 నాటికి),  అత్యవసర పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, వీసాలు రీ-స్టాంప్ చేయడం, గడువు ముగిసిన లేదా రద్దు చేయబడిన వీసాలు లేదా కొత్త ఉద్యోగం కోసం వీసా పొందడం వంటివి ఉన్నాయి.ఇతర కేటగిరీలు - NRI సర్టిఫికేట్లు (విద్యాపరమైన ప్రయోజనాల కోసం), పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్లు (ఉద్యోగం లేదా ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం), భారతదేశంలో ప్రవేశం కోసం లేదా విదేశాల్లో విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు పాస్‌పోర్ట్ పునరుద్ధరణ వంటి సర్వీసులను అందించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com