కేరింత : రివ్యూ
- June 12, 2015
మంచి మిక్కి జె మేయర్ సంగీతం సినిమాటోగ్రఫీ కొన్ని సన్నివేశాలు చెడు ఎడిటింగ్ కథనం పాత్రల మధ్య ఎమోషన్ లేకపోడం దర్శకత్వం నూకరాజు(పార్వతీశం) ఈ చిత్రాన్ని మొదలుపెడతాడు, ప్రతి ఒక్కరికి కాలేజీ ఒక జ్ఞాపకం , స్నేహం , ప్రేమ వంటి జ్ఞాపకం .. ఆరుగురు స్నేహితుల గురించి చెప్పడం మొదలు పెడతాడు నూకరాజు. ముందుగా జై(సుమంత్ అశ్విన్) ఫోటోగ్రఫీ లో ఎమ్. ఏ చేస్తుంటాడు, ఎప్పుడు పాజిటివ్ గా ఉండటం అందరిని సంతోషపెట్టడం అతని నైజం , అలాంటి జై , మనస్విని(శ్రీ దివ్య) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. కాని ఆమె జాడ తెలియక ఇబ్బంది పడుతుంటాడు, తీరా తెలిసాక ఆమెను ప్రేమలో పడెయ్యడానికి నానా తంటాలు పడుతుంటాడు. ఇదిలా ఉంటె మనస్విని ఒక డాక్టర్ ఆస్ట్రేలియా వెళ్లి రీసెర్చ్ చెయ్యాలని తన ఆశయం , ప్రేమలో పడితే తన ఆశయానికి అడ్డు వస్తుంది అని జై ని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఇక రెండవ కథ నూక రాజు శ్రీకాకుళంలో నిరుపేద కుటుంబం నుండి ఎం ఏ చదువుకోడానికి హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ సంస్కృతిని చూసి మరియు ఇక్కడి అమ్మాయిలకి ఆకర్షితుడు అయ్యి పేస్ బుక్ లో ఒక అమ్మాయిని ప్రేమలో పడేసానని అనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో భావన(సుకీర్తి) ప్రేమను అర్ధం చేసుకోలేడు. ఈ విషయం అర్ధం అయ్యి నూక రాజు తిరిగి భావన దగ్గరకి వచ్చినా ఆమె అంగీకరించదు. భావన బ్యూరోక్రాట్ ఆశయంగా సాగుతున్న భావన జీవితంలోకి వస్తాడు నూకరాజు అతనంటే ఇష్టం ఉన్న కూడా అతని ప్రవర్తన వాళ్ళ నొచ్చుకొని నూకరాజు ని దూరంగా ఉంచుతుంది. సిద్దార్థ్(విశ్వనాథ్) మ్యూజిక్ లో ఎం ఏ చేస్తున్నా అమ్మకి భయపడి ఇంట్లో ఎం సి ఏ చేస్తున్నట్టు చెప్తాడు ఇలా ప్రతి విషయంలో అమ్మకి భయపడే సిద్దార్థ్, అప్పుడే అమెరికా నుండి వచ్చిన ప్రియ(తేజస్వి మదివాడ) ను చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం వాళ్ళ అమ్మతో చెప్పకుండానే చెప్పేసాను అని అబద్దం చెప్తాడు సిద్దార్థ్ ఈ విషయం తెలిసిన ప్రియ అతని నుండి దూరంగా వెళ్ళిపోతుంది. జై , మనస్విని లు కలిసారు? భావన ప్రేమను నూకరాజు ఎలా అర్ధం చేసుకున్నాడు? భావన నూకరాజు ని అంగీకరించిందా? ప్రియ విషయం వాళ్ళ అమ్మకి సిద్దార్థ్ ఎలా చెప్పాడు అసలు చెప్పాడా లేదా? ప్రియను ఎలా ఒప్పించాడు? అన్న ప్రశ్నలకి సమాధానాలే మిగిలిన కథ... సుమంత్ అశ్విన్, ఇప్పటికి ఇటువంటి పాత్రలు పలుమార్లు చూసాం అనాలో లేక అయనక ఏ పాత్ర అయినా ఇలానే చేస్తాడు అనాలో తెలియట్లేదు కాని మొదటి చిత్రం "తునీగా తునీగా" నుండి అయన బాడీ లాంగ్వేజ్ మరియు ఎక్స్ప్రెషన్ లో తేడా బొత్తిగా కనపడదు. పాత్ర ఏదయినా అదే రకమయిన నటన కనబరుస్తున్నాడు ఈ నటుడు కాస్త పాత్రకి తగ్గ తేడా చూపిస్తే బాగుంటుంది. శ్రీ దివ్య పాత్ర అంత పెద్దది కాదు కథలో సరిగ్గా ఇమడలేదు , హీరో కి హీరోయిన్ ఉండాలి కాబట్టి ఈ పాత్ర అన్నట్టు ఉంటుంది. ఉన్నంతలో ఈ నటి ఆకట్టుకున్నా కూడా బలం లేని పాత్రలో ఎంత నటన కనబరిచినా ప్రేక్షకుడిని కనెక్ట్ చెయ్యలేరు కదా.. ఈ పాత్ర కూడా అంతే .. అమెరికా నుండి వచ్చిన అమ్మాయి పాత్రలో నటించిన తేజస్వి మదివాడ ఆకట్టుకుంది అటు అందంతోనే కాకుండా అమాయకత్వం కూడా కలబోసి నటనతో కూడా ఆకట్టుకుంది. ఒక భాద్యత గల విద్యార్థిని గా సుకీర్తి నటన బాగుంది. విశ్వనాధ్ నటన కొన్ని సన్నివేశాలలో పరవాలేదు అనిపించినా కీలకమయిన ఎమోషనల్ సన్నివేశాలలో అత్యంత పేలవంగా ఉన్నాయి. పార్వతీశం , శ్రీకాకుళం నుండి వచ్చిన అమాయకమయిన పాత్ర ధరించిన ఈ నటుడు కొంతమేరకు ఆకట్టుకున్నాడు చిత్రంలో అప్పుడప్పుడు ఊరటనిచ్చిన పాత్ర ఇదొక్కటే కాని సమస్య అంటే ఈ నటుడు కొంతమేరకు ఆకట్టుకున్నా చాలా వరకు విసిగించాడు. అతని యాస అక్కడక్కడా బానే ఉన్నా అనవసరం అనిపించిన సన్నివేశాలెన్నో ఉన్నాయి. మిగిలిన నటీనటులందరు వారి పత్రాల మేరకు ఆకట్టుకున్నారు.. కొత్తది అని చెప్పుకోడానికి ఆస్కారం లేని కథ ఇది , ఈ చిత్రం ఎప్పుడో మొదలయినా కూడా ఇప్పటికే ఇలాంటి కథలు పలుమార్లు తెర మీద చూడటం మూలానా ఈ కథ అప్పటికి కొత్తదే అయ్యుండచ్చు ఇప్పుడు మాత్రం చాలా పాతది. కథనం విషయానికి వస్తే ఆరు పాత్రలు ఆరు జీవితాలు వాటి మధ్య బంధాలను సరిగ్గా చూపిస్తే కనెక్ట్ అవుతాయి. ఈ విషయం లో కథనం అతి దారుణంగా ఫెయిల్ అయ్యింది ఏ పాత్రకి ఆ పాత్ర అదొక్కటే పాత్ర అన్నట్టు ప్రవర్తించాయి. ఒక స్నేహితుల గ్యాంగ్ కథ అని చెప్పినా కూడా ఈ చిత్రం చూడటానికి ముగ్గురు వేరు వేరు యువకుల ప్రేమకథలు అన్నట్టు అనిపిస్తుంది. వీరి మధ్య స్నేహాన్ని సరిగ్గా చూపించకుండా ప్రేక్షకుడిని ఎలా కనెక్ట్ చెయ్యాలి అనుకున్నారో కథన రచయితలు ... సాయి కిరణ్ అడివి దర్శకత్వం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అబ్బూరి రవి అందించిన మాటలు కొన్ని బాగా ఉన్నా ఎమోషనల్ సన్నివేశాల వద్ద కావలసిన ఎమోషన్ అయితే రాలేదు మరీ పేలవంగా సాగాయి. విజయ్. కె. చక్రవర్తి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ హైలెట్స్ లో ఇదొకటి. సంగీతం అందించిన మిక్కి జె మేయర్ అటు పాటలతో ఇటు నేపధ్య సంగీతంతో ఆకట్టుకున్నారు. కొన్ని కీలక సన్నివేశాలు ఆ మాత్రం నిలబడ్డాయి అంటే కారణం మిక్కి అందించిన సంగీతమే కారణం. "మిల మిల " మరియు "కేరింత" పాటలు చాలా బాగున్నాయి. మధుసూదన్ అందించిన ఎడిటింగ్ ఆకట్టుకోలేదు చిత్ర నిడివి మరియు జంప్స్ చాలా కనిపించాయి.
స్టార్ కాస్ట్:సుమంత్ అశ్విన్,శ్రీ దివ్య,తేజస్వి'.యం
ప్రొడ్యూసర్:దిల్ రాజు
డైరెక్టర్: సాయి కిరణ్ అడివి
మ్యూజిక్: మిక్కి జె మేయర్
--మాగల్ఫ్.కాం రేటింగ్: 3/5
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







