ఏపీ, తెలంగాణలో వేరువేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. 10మంది మృతి..
- May 22, 2022
ఏపీ, తెలంగాణలో ఆదివారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం దాస్‌తండా సమీపంలో బైక్‌ను బొగ్గు లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులను ఎర్రాయిగూడెంకు చెందిన హనుమంతు, ఈసం స్వామిగా గుర్తించారు.
మేడ్చల్ జిల్లా సూరారం వద్ద కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎంను లారీ ఢీకొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ మరణించాడు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. మరోవైపు వరంగల్‌లోని ఖమ్మం బైపాస్ హంటర్ రోడ్డు ఫ్లై ఓవర్‌పై రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో ఫ్లైపైనుంచి ఓ కారు కిందపడిపోయింది. దీంతో ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరొకరు దవాఖానలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడ్డారు. అతడిని పోలీసులు ఎంజీఎం దవాఖానకు తరలించారు. మృతిచెందిన వారిని ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సారయ్య, ఆయన భార్య సుజాతగా గుర్తించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ జిల్లా తాడిపత్రిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద రహదారిపై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురుకి గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా సందేపల్లి మండలంలో రెండు బైక్‌లు ఢీకొనడంతో ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇలా ఆదివారం తెల్లవారు జాము నుంచి ఉదయం 10గంటల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







