నా జీతం Dh 20,000 కన్నా తక్కువున్నా వితంతువైన మా అమ్మ వీసాకి స్పాన్సర్ చేయవచ్చా?

- May 22, 2022 , by Maagulf
నా జీతం Dh 20,000 కన్నా తక్కువున్నా వితంతువైన మా అమ్మ వీసాకి స్పాన్సర్ చేయవచ్చా?

ప్రశ్న: ఇటివలే మా అమ్మ వితంతువై నా స్వదేశంలో ఒంటరిగా ఉంటోంది.అయితే నేను అమ్మను నా దగ్గరికి తెచ్చుకోవడానికి ఆమె వీసా కు స్పాన్సర్ చేయడానికి ఏదైనా మార్గం ఉందా? ఎందుకంటే నా జీతం నెలకు Dh7,000 కన్నా తక్కవే.ఒకవేళ నాతో పాటుగా ఆమెకు వసతి కూడా కల్పించలేని స్థితిలో ఉంటే ఎలా, ఆమెను న్యాయ బద్దంగా ఇక్కడికి తీసుకురావాలి అంటే ఏమి చేయాలి ? 

సమాధానం: మీరు అడిగిన ప్రశ్న పరిశీలించి చూస్తే, మీ అమ్మను చూసుకోవడానికి దుబాయ్ లో నివాసం ఉంటున్న మీరు తప్ప తోబుట్టువుల ఎవరు లేరని తెలుస్తోంది.అయితే యూఏఈ లో ఒక మనిషి కనీసం Dh 20,000 లు సంపాదిస్తూ, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇల్లును కలిగి ఉంటే అతడు లేదా ఆమె తల్లిదండ్రులకు స్పాన్సర్ చేయవచ్చు. 

అలాగే, స్వదేశంలో ఉన్న తమ తల్లిదండ్రులలో ఒకరు మరణిస్తే వారి కుమారుడు లేదా కుమార్తె ఆ దేశంలో ధ్రువీకరించబడ్డ డెత్ సర్టిఫికెట్ ను సమర్పించాలి.ఆ తర్వాత ఆ పత్రాన్ని అరబిక్ భాషలోకి తర్జుమా చేసి యూఏఈ విదేశీ మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వశాఖ(MOFA) చేత ధృవీకరించబడాలి.ఇవే కాకుండా స్పాన్సర్ చేయడానికి పైన పేర్కొన్న పద్ధతి ప్రకారం, ఎవరైతే స్పాన్సర్ చేయాలి అనుకుంటున్నారో అందు కోసం యూఏఈలో తల్లిదండ్రుల యొక్క సంరక్షణ బాధ్యతలు చూడబోతున్నట్లుగా స్వదేశంలో ఉన్న రాయబార కార్యాలయంచే ధ్రువీకరించబడ్డ dependency Certificate ను తీసుకోవాలి.ఈ సంబంధిత పత్రాలను అరబిక్ భాషలోకి తర్జుమా చేసి MOFA చే ధ్రువీకరించబడాలి.

ఒకవేళ , మీ జీతం Dh20,000 కంటే తక్కువగా ఉండే పరిస్థితుల్లో స్వదేశంలో ఒంటరిగా ఉంటున్న మీ అమ్మ కు స్పాన్సర్ చేయాలి అనుకుంటే " General Directorate of Residency and Foreigners Affairs - Dubai (GDRFA-Dubai)" కి దరఖాస్తు చేసుకోవాలి.ఈ దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన సంబంధిత పత్రాలు మరియు కుటుంబాన్ని మీరొక్కరే పోషిస్తున్నట్లుగా ధ్రువీకరించాలి. 

వీటితో పాటుగా పైన పేర్కొన్న పత్రాలు అంటే మీ యూఏఈ నివసిస్తున్నట్లు గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్ , నివాస వీసా యొక్క కాపీలు , జీతానికి సంబంధించిన సర్టిఫికేట్ , ఉద్యోగ ఒప్పంద పత్రం , Ejari రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, వినియోగ బిల్లు (utility bill), గత మూడు నెలలకు సంబంధించిన తాజా బ్యాంకు ఖాతా నివేదిక (statement), మీ అమ్మ గారికి పాస్పోర్ట్ కాపీ.GDRFA- dubai మీ దరఖాస్తు ను పరిగణనలోకి తీసుకోవాలి అంటే ఈ పత్రాలన్ని సమర్పించాలి. 

ఒకవేళ మీ అమ్మకి నివాస వీసా రాకపోతే మీరు దీర్ఘకాలిక వీసా కు దరఖాస్తు చేయండి. మీ అమ్మ గారు మీతోనే ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటే ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారు వీసాను కూడా తీసుకోవడం మంచిది. 

ఇంకా మీకేమైనా తగిన సూచనలు, సలహాలు కావాలంటే GDRF - Dubai సంస్థ వారిని సంప్రదించండి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com