ఇజ్రాయెల్లో మొదటి మంకీపాక్స్ కేసు
- May 22, 2022
టెల్ అవీవ్: కరోనావైరస్ వ్యాప్తి తగ్గిందిలే అనుకుంటే.. మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మంకీ పాక్స్ అనే వైరస్ ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది.
ఇప్పటికే పలుదేశాల్లో ఈ మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇజ్రాయెల్లోనూ మొదటి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నాయని గుర్తించినట్టు ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు. మంకీ పాక్స్ అనుమానిత కేసులను పరిశీలిస్తున్నామని తెలిపారు.
టెల్ అవీవ్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తిలో మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నాయని గుర్తించినట్టు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాల నుంచి ఎవరైనా జ్వరం, గాయాలతో తిరిగివస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఇతర అనుమానిత మంకీపాక్స్ కేసులను వైద్య బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ హెడ్ షారన్ అల్రోయ్-ప్రీస్ ఇజ్రాయెలీ ఆర్మీ రేడియోతో చెప్పారు. ఇజ్రాయెల్లో మంకీ పాక్స్ కేసు మధ్యప్రాచ్యంలో మొట్టమొదటిగా గుర్తించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచవ్యాప్తంగా 80 కేసులను గుర్తించింది. అందులో దాదాపు 50 అనుమానిత కేసులను గుర్తించింది. మంకీ పాక్స్ కేసులు మశూచికి సంబంధించిన వ్యాధి మాదిరిగానే ఉన్నాయని తెలిపింది. అయితే ఈ కేసులు గతంలో మధ్య, పశ్చిమ ఆఫ్రికాతో సంబంధాలు ఉన్న వ్యక్తులలో మాత్రమే కనిపించాయి. కానీ, బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, యుఎస్, స్వీడన్ కెనడాలోనూ ఇదే తరహా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఆఫ్రికాకు వెళ్లని యువకులలోనూ ఈ మంకీ పాక్స్ కేసులు బయటపడ్డాయి.
ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియాలో కూడా మంకీ పాక్స్ కేసులను గుర్తించాయి. ఈ వైరస్ ప్రైమేట్స్ సాధారణంగా ఇతర అడవి జంతువులలో ఉద్భవిస్తుంటుంది. ఈ వ్యాధి సోకిన బాధితుల్లో చాలామందిలో జ్వరం, శరీర నొప్పులు, చలి, అలసట వంటి సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించింది. ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో ముఖం, చేతులు, శరీరంలోని ఇతర భాగాలపై దద్దుర్లు, గాయాలు ఏర్పడతాయి. మంకీ పాక్స్ లక్షణాల ఆధారంగా వ్యాధి తీవ్రతను అంచనా వేయొచ్చునని వైద్యనిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







