దేశంలోనే తొలిసారిగా..అన్నపూర్ణ స్టూడియోస్ లో సరికొత్త టెక్నాలజీ
- May 23, 2022
హైదరాబాద్: ఒక సినిమా తీయాలంటే.. సన్నివేశానికి తగ్గట్టు లొకేషన్స్ వెతుక్కోవాలి. దేశాలు దాటి షూటింగ్ చేయాల్సి వస్తుంది. వీసా, విమానటిక్కెట్లు, అకామడేషన్, షూటింగ్ సామగ్రి..
ఇలా నిర్మాతకి బోలెడంత ఖర్చు. తీరా లొకేషన్‌కు వెళ్ళాక వాతావరణం బాగోకపోతే ఆరోజు షూటింగ్ బంద్. ఖర్చు పెట్టిన డబ్బంతా వృధా. ఈ సమస్యలకు చెక్ పెట్టే అత్యాధునిక సాంకేతికతే వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ (Virtual Production Technology). ఈ సాంకేతికతతో ఒక చిన్న గదిలో మొత్తం షూటింగ్‌ను కానిచ్చేయొచ్చు. పినిమా ప్రపంచంలో ఈ సరికొత్త టెక్నాలజీని దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభిస్తున్నారు. అక్టోబర్‌లో షూటింగ్స్ ప్రారంభం కానుండడం విశేషం.
హిమాయాల సీన్ తీయాలంటే.. హిమాలయాల వరకూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద తెరపై హిమాలయాల బ్యాక్ గ్రౌండ్ కనిపించేలా చేసి.. దాని ముందు నటిస్తే చాలు. సినిమాలో చూస్తే నిజంగానే హిమాలయాల్లో తీసినట్టు ఉంటుందా సీన్. దాన్ని సుసాధ్యం చేసేదే వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ. ఇప్పటికే విదేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీ .. ఇప్పడు భారతీయ సినీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నది. ఈ సాంకేతికతతో కూడిన వేదికను అన్నపూర్ణా స్టూడియోస్ లో ఏర్పాటు చేయబోతున్నారు. లొకేషన్, స్పేస్, బడ్జెట్ పరిమితులకు లోబడి రాసుకున్న కథను సినిమాగా, వెబ్ సిరీస్ గా తీర్చిదిద్దేందుకు ఈ వేదిక చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఆన్ లొకేషన్ ప్రొడక్షన్ ఖర్చుల్ని తగ్గించి, మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకూ ప్రత్యక్షంగా చూడగలిగే, సమయం, డబ్బును ఆదాచేసే టెక్నాలజీ ఇది అని చెబుతున్నారు. మరి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. నిర్మాతలకు పండగే.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







