అక్కినేని కాంపౌండ్‌ని వదల్లేకపోతున్న ఆ ‘హిట్టు’ డైరెక్టర్
- May 23, 2022
‘బొమ్మరిల్లు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి, సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. తన కెరీర్లో ‘బొమ్మరిల్లు’ సూపర్ డూపర్ హిట్ సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది ఈ సినిమా. అటు హీరో సిద్ధార్ద్కీ, ఇటు హీరోయిన్ జెనీలియాకీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది.
ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది జెనీలియా. ఇకపోతే, సిద్ధార్ధ్ కూడా అంతే. అయితే, డైరెక్టర్‌గా బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే నడిచింది ఆ తర్వాత. లేటెస్టుగా అఖిల్ కోసం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ద్వారా బొమ్మరిల్లు భాస్కర్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు అక్కినేని నాగార్జున. .
నాగార్జున తనపై పెట్టుకున్న నమ్మకాన్ని భాస్కర్ నిలబెట్టుకున్నాడు. సక్సెస్‌ని టేస్ట్ చేయలేకపోతున్న అఖిల్‌కి సక్సెస్ అంటే ఏంటో ఈ సినిమా ద్వారా చూపించేశాడు. ఆ తర్వాత అఖిల్ ‘ఏజెంట్’ మూవీలో నటిస్తున్నాడనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు మళ్లీ అక్కినేని కాంపౌండ్లోనే బొమ్మరిల్లు భాస్కర్ ఇంకో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట.
ఈ సారి అన్నయ్య చైతూతో భాస్కర్ సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ చైతూ చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయ్. ఈ క్రమంలోనే భాస్కర్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేసి పెట్టాడట. ఈ సినిమాలో చైతూను చాలా కొత్తగా చూపించాలనుకుంటున్నాడట బొమ్మరిల్లు భాస్కర్.
అసలే వరుస సక్సెస్‌ల మీదున్న చైతూతో బొమ్మరిల్లు భాస్కర్ గానీ సరికొత్త మ్యాజిక్ ఏదైనా క్రియేట్ చేశాడంటే, టాలీవుడ్లో ఆయనకు మళ్లీ ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం. ఇక చైతూ విషయానికి వస్తే, త్వరలోనే ‘థాంక్యూ’ సినిమాతో అభిమానుల్ని పలకకరించబోతున్నాడు. అలాగే ‘లాల్ సింగ్ చద్దా’ తో బాలీవుడ్‌లోనూ తప్పటడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు చైతూ.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







