సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము ధూళితో కూడిన తుపాను

- May 23, 2022 , by Maagulf
సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము ధూళితో కూడిన తుపాను

రియాద్: నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ, వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ఇసుక, దుమ్ము, ధూళితో కూడిన తుపాన్లు సంభవిస్తాయని హెచ్చరికల్లో పేర్కొంది. నార్తరన్ బోర్డర్ రీజియన్స్‌లో ఈ ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ ఇసుక తుపాన్ల సమయంలో గాలి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం వుంది. పలు దేశాల్లో ఈ తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దుమ్ము ధూళితో కూడిన తుపాన్ల విషయానికొస్తే, గత ఇరవై ఐదేళ్ళలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పరిస్థితులు వున్నాయని కువైట్ పేర్కొంది. ఇరాకీ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్, పూర్ విజిబిలిటీ కారణంగా విమానాల రాకపోకల్ని రద్దు చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com