ప్రముఖ నటుడు చంద్రమోహన్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ
- May 23, 2022
ప్రముఖ సినీ నటుడు,చంద్రమోహన్ (మల్లంపల్లి చంద్రశేఖర్ రావు) కి
పుట్టిన రోజు శుభాకాంక్షలు.
జన్మ నామం: మల్లంపల్లి చంద్రశేఖర రావు
జననం: 1941 మే 23 (వయస్సు 81)
పమిడిముక్కల, కృష్ణా జిల్లా
భార్య: జలంధర
పిల్లలు: ఇద్దరు కుమార్తెలు
ఒకప్పటి హీరో, తర్వాత కామెడీ హీరో, ఆ తర్వాత టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్...కేరెక్టర్లన్నీ ఆయనవే. మొత్తంగా 55 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్న అనుభవం...కలిపితే చంద్రమోహన్.
'రంగుల రాట్నం'తో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్...మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకన్నారు.బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా చంద్రమోహన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.చంద్ర మోహన్ స్పెషాలిటీ ఏమిటంటే... అప్పట్లో ఆయన సరసన హీరోయిన్ గా చేసిన వారి లక్కు తిరిగినట్టే... కట్ చేస్తే ఎక్కడికో వెళ్లేది వారి కెరీర్. అంతటి లక్కీ హ్యాండ్ చంద్రమోహన్ ది.చంద్ర మోహన్‌తో నటించిన తర్వాతే శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి వంటి ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా రాణించారు.
చంద్ర మోహన్ నటుడిగా ఒక మూసకే పరిమితం కాలేదు.హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో రాణించాడు.
ప్రఖ్యాత దర్శకుడు కే విశ్వనాథ్ కి కజిన్ అవుతారాయన.వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సిరిసిరి మువ్వ' సూపర్ డూపర్ హిట్.సినిమాలో తనది హీరో కేరెక్టరా... కాదా? అని చూసుకున్నదే లేదు చంద్రమోహన్.వచ్చిన పాత్రకు తగిన న్యాయం చేయడమనే థియరీ పక్కాగా ఫాలో అయ్యారాయన.చంద్రమోహన్ నటించిన ‘ఓ సీత కథ’తో వేటూరి గీతరచయితగా పరిచయం కావడం విశేషం.
'గంధము పూయరుగా...' అనే పాట మీరు వినేవుంటారు.ఈ పాట శుభోదయం అనే సినిమాలోనిది. ఇందులో చంద్రం అనే పాత్ర వేశారు చంద్రమోహన్. పక్కింటి అమ్మాయి అనే సినిమా గుర్తుందా? జయసుధ, ఎస్పీబీ, చక్రవర్తి యాక్ట్ చేసిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే ఓ పెద్ద హిట్. అంతే కాదు పాటలన్నీ చాలా సూపర్ హిట్. ఇటు హీరోగా... అటు కేరెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ కెరీర్ లో అనేక హిట్లందుకున్నారు చంద్రమోహన్. రెండు రెండ్లు ఆరు,జయమ్ము నిశ్చయమ్మురా వంటి సినిమాలతో కామెడీ హీరోగా టాలెంట్ చూపారాయన.
అల్లుడు గారు తో ఫుల్ టైం కేరెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు చంద్రమోహన్. తర్వాత వచ్చిన గులాబీతో తండ్రి పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచీ వరుస సినిమాలు. నువ్వు నాకు నచ్చావ్, 7జీ బృందావన్ కాలనీ, అతనొక్కడే వంటి చిత్రాల్లో హీరో ఫాదర్ గా 100 పర్శెంట్ ఫిట్ అనిపించుకున్నారు. అతనొక్కడే చిత్రానికిగాను చంద్రమోహన్ బెస్ట్ కేరెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డునందుకున్నారు.
దూకుడు, యముడికి మొగుడు...ఇలా చంద్రమోహన్ కెరీర్ నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూనే వుంది.ఎప్పుడూ నష్టాలను చవిచూడలేదు.మొత్తానికి సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చంద్ర మోహన్‌కు మాగల్ఫ్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.
హైదరాబాద్ లో చంద్ర మోహన్ పుట్టిన రోజు వేడుకల్లో కుటుంబ సభ్యులు మరియు వంశీ బర్కిలీ అవార్డ్స్ చైర్మన్ వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







