మే 26న ఐఎస్‌బీ వార్షికోత్సవానికి రానున్న ప్రధాని మోదీ

- May 23, 2022 , by Maagulf
మే 26న ఐఎస్‌బీ వార్షికోత్సవానికి రానున్న ప్రధాని మోదీ

హైదరాబాద్: హైదరాబాద్ లోని ప్రముఖ బిజినెస్ స్కూల్ ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్'( ISB) 20వ వార్షికోత్సవం ఈ నెల 26న నిర్వహించనున్నామని ఐఎస్‌బీ డీన్ మదన్ పిల్లుట్ల సోమవారం అధికారికంగా ప్రకటించారు. మే 26న జరగనున్న ఈ వార్షికోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారని ఆయన పేర్కొన్నారు.ఐఎస్‌బీ నెలకొల్పి 20 ఏళ్ళు పురస్కరించుకున్న సందర్భంగా వార్షిక ఉత్సవాలలో ప్రధాని మోదీ ఇతర ప్రముఖులు పాల్గొననున్నారని డీన్ మదన్ పిల్లుట్ల తెలిపారు. కాగా మొదటిసారిగా ఈ ఏడాది ఐఎస్‌బీ మొహాలీతో కలిసి హైదరాబాద్ క్యాంపస్ లోనే సంయుక్తంగా గ్రాడ్యుయేషన్ సెర్మోనీ నిర్వహిస్తున్నారు. మొత్తం 900 మంది విద్యార్థులు 2022 విద్యా సంవత్సరానికి గానూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంని కంప్లీట్ చేశారు. వీరిలో 600 మంది ISB హైదరాబాద్ క్యాంపస్ నుంచి పట్టభద్రులు కాగా..300 మంది మొహాలీ క్యాంపస్ నుంచి పూర్తి చేశారు.

వీరిలో గోల్డ్ మెడల్ సాదించిన 8 మందికి ప్రధాని మోదీ చేతుల మీదుగా సర్టిఫికేట్ అందించనున్నట్లు ఐఎస్‌బీ డీన్ మదన్ పిల్లుట్ల పేర్కొన్నారు. ఐఎస్‌బీ గతంలో 5వ వార్షికోత్సవానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, 10వ వార్షికోత్సవానికి అప్పటి రాష్ట్రపతి ప్రతిభ పాటిల్, 15వ వార్షికోత్సవానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. మే 26న జరగనున్న 20వ వార్షికోత్సవానికి ప్రధాని మోదీ విచ్చేసి విద్యార్థులనుద్దేశించి మాట్లాడనున్నారని డీన్ మదన్ పేర్కొన్నారు. ఈ వార్షికోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించామని, ఆయన బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నామని తెలిపినట్లు డీన్ మదన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో సీనియర్ మంత్రి రానున్నారని, వారెవరు అనే విషయం ఇంకా తెలియలేదని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com