ట్రాఫిక్ జరిమానాలపై 35% తగ్గింపు: యూఏఈ
- May 24, 2022
యూఏఈ: ట్రాఫిక్ జరిమానాలను ముందస్తుగా చెల్లించాలని అబుదాబి పోలీసులు వాహనదారులను కోరారు. ఉల్లంఘన జరిగిన 60 రోజులలోపు జరిమానా చెల్లించినట్లయితే వారికి 35 శాతం తగ్గింపును ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే స్వాధీనం చేసుకున్న వాహనాలపై విధించే రుసుములు, ఆలస్య జరిమానా చెల్లింపులకు (ఏదైనా ఉంటే) కూడా తగ్గింపులు వర్తిస్తాయని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ జరిమానాలను www.adpolice.gov.ae ద్వారా లేదా AD పోలీస్ యాప్ ద్వారా చెల్లించవచ్చు. అబుదాబి కమర్షియల్ బ్యాంక్ (ADCB), అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ (ADIB), ఫస్ట్ అబుదాబి బ్యాంక్ (FAB), మష్రెక్ అల్ ఇస్లామి, ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంకుల ద్వారా ట్రాఫిక్ జరిమానాలను ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







