ప్రపంచకప్‌కు అత్యున్నత స్థాయి భద్రత: ఖతార్

- May 24, 2022 , by Maagulf
ప్రపంచకప్‌కు అత్యున్నత స్థాయి భద్రత: ఖతార్

దోహా: FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022కి అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తామని ఖతార్ హామీ ఇచ్చింది. దోహాలోని ఇంటర్‌కాంటినెంటల్ జరిగిన FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 సెక్యూరిటీ లాస్ట్-మైల్ కాన్ఫరెన్స్‌ను మేజర్ జనరల్, సేఫ్టీ & సెక్యూరిటీ ఆపరేషన్స్ కమిటీ (SSOC) చైర్మన్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లా అల్ అన్సారీ ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో  ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ, ఉప ప్రధాన మంత్రి, రక్షణ వ్యవహారాల శాఖ మంత్రి  డాక్టర్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్ అత్తియా పాల్గొన్నారు. వివిధ దేశాలు, భద్రతా అధికారుల మధ్య అనుభవాల మార్పిడికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు మేజర్ జనరల్ అల్ అన్సారీ అన్నారు. ఖతార్ అత్యధిక భద్రతా ప్రమాణాలను సాధించిందని, ప్రస్తుతం తక్కువ నేరాల రేటుతో అత్యంత సురక్షితమైన దేశాలలో ఒకటిగా నిలిచిందన్నారు. FIFA డైరెక్టర్ ఆఫ్ సెక్యూరిటీ హెల్ముట్ స్పాన్ మాట్లాడుతూ.. ఫిఫా ప్రపంచ కప్ కోసం భద్రత, భద్రతా ప్రణాళికలకు సంబంధించి ఇప్పటికే సంతకాలు పూర్తి అయినట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com