దేవెగౌడ,కుమారస్వామితో కేసీఆర్ భేటీ..జాతీయ రాజకీయాలపై మంతనాలు..!
- May 26, 2022
* దేశ రాజకీయాలపై చర్చిస్తున్న కేసీఆర్
* రాష్ట్రపతి అభ్యర్థిపై కూడా కొనసాగుతున్న చర్చ
బెంగళూరు: సీఎం కెసిఆర్ మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ అయ్యారు. ఈ ఉదయం హైదరాబాదు నుంచి బెంగళూరుకు కేసీఆర్ ప్రత్యేక విమానంలో వెళ్లిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చేరుకున్న ఆయన దేవేగౌడ నివాసానికి వెళ్లారు. ఆయనకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వాగతం పలికారు. వీరు ముగ్గురు ప్రస్తుత దేశ రాజకీయాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి గురించి కూడా చర్చలు జరుపుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషించాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతీయ పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం అవుతున్నారు. సాయంత్రం 4 గంటలకు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు కేసీఆర్ తిరుగుపయనమవుతారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







