జూన్‌లో ఖతార్‌లో పర్యటించనున్న భారత ఉప రాష్ట్రపతి

- May 26, 2022 , by Maagulf
జూన్‌లో ఖతార్‌లో పర్యటించనున్న భారత ఉప రాష్ట్రపతి

దోహా: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జూన్ తొలి వారంలో ఖతార్‌లో పర్యటించనున్నారు.ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తొలి సారిగా ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు ఖతార్‌లో పర్యటించనున్నారు. గబాన్, సెనెగల్ మరియు ఖతార్‌లలో మే 30 నుంచి జూన్ 7 వరకు వెంకయ్యనాయుడు పర్యటిస్తారు. దోహాలో జూన్ 4 నుంచి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు బృందం పర్యటిస్తుంది. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, ఇరు దేశాల మధ్య సన్నహిత సంబంధాలపై ఖతార్ ప్రతినిధి బృందంతో చర్చిస్తుంది. కమ్యూనిటీ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com