భారత్ కరోనా అప్డేట్
- May 27, 2022
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కొత్తగా 2,710 కేసులు వెలుగుచూశాయి. మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు . ఒక్కరోజే 2,296 మంది కరోనాను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారినపడి కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది. దేశవ్యాప్తంగా గురువారం 14,41,072మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 192,97,74,973కు చేరింది. ఒక్కరోజే 4,65,840 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. క్రితం రోజుతో పోల్చితే మాత్రం స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 5,67,240 మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 1,427 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 53,01,57,770కు చేరింది. మరణాల సంఖ్య 63,07,663కు చేరింది. ఒక్కరోజే 5,97,520 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 50,06,7,229గా ఉంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







