మెడికవర్ హాస్పిటల్స్ వారిచే ప్రత్యేక ఉచిత హెల్త్ ప్యాకేజీ
- May 27, 2022
హైదరాబాద్: ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్స్ హెల్త్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వారిచే ప్రత్యేక ఉచిత హెల్త్ ప్యాకేజీ (3000 రూపాయల విలువగల పరీక్షలు ఉచితం) పోస్టర్ విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంజలి మరియు మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్, కన్సల్టెంట్ గైనకాలోజిస్ట్ & ఒబెస్ట్ట్రీషన్-డాక్టర్ రాధిక, డాక్టర్ మీనాక్షి, రేడియాలజిస్ట్ డాక్టర్ హేమలత మరియు సెంటర్ హెడ్ అనిల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంజలి మాట్లాడుతూ కోవిడ్‌పై వున్న భయంతో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు జాగ్రత్తగా వుండాలని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.అనంతరం ఉచిత హెల్త్ ప్యాకేజీ (3000 రూపాయల విలువగల పరీక్షలు ఉచితం) ని విడుదల చేసారు.ప్రజలకు చేరువలో ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీలు మరెన్నో అందించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని అన్నారు.
అనంతరం డాక్టర్ రాధిక, కన్సల్టెంట్ గైనకాలోజిస్ట్ & ఒబెస్ట్ట్రీషన్ మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు.తగిన సమయంలో పరీక్షలు చేయించుకోవాలని తద్వారా వివిధ రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఆరోగ్యకరమైన అంశాలపై సమన్వయం, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించగలరు, మన ఆరోగ్యం మన బాధ్యత. మన ఆరోగ్యాన్ని రక్షించడం కోసం ఎవరో వచ్చి, ఏదో చేయరు. మన ఆరోగ్యాన్నికాపాడుకోవాల్సింది మనమే..అందుకు శ్రద్ధ తీసుకోవాల్సిందీ మనమే అని అన్నారు. మహిళలు వివిధ దశల్లో తమ ఆరోగ్యం గురించి ఆలోచించించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ మీనాక్షి కన్సల్టెంట్ గైనకాలోజిస్ట్ & ఒబెస్ట్ట్రీషన్ గారు మన రాబోయే తరాలకు అందమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన వాతావరణాన్ని ఇద్దాం,ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని తెలియజేసే దిశగా ఈ రోజును మనం జరుపుకుంటున్నాం.ఆరోగ్యంగా ఉండే అందుకు మహిళలు తగిన వ్యాయామాలు చేస్తూ, పౌష్టికాహారం తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ సందర్భంగా సెంటర్ హెడ్ అనిల్ మాట్లాడుతూ ఉచిత హెల్త్ చెక్ ప్యాకేజీ చేయు పరీక్షలు కంప్లీట్ బ్లడ్ షుగర్ ,హిమోగ్లోబిన్, ఈఎస్అర్, రాండమ్ బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్, ఈసీజీ, యుఎస్ జి అబ్డోమెన్ పెల్విస్, పాప్ స్మెర్,గైనాకాలోజిస్ట్, జనరల్ ఫీజిషియన్, న్యూట్రిషన్ కన్సల్టేషన్ చేయబడును.ఈ ఆఫర్ మే 28th 2022 నుండి 4th జూన్ 2022 వరకు మాత్రమే.ముందుగా అపాయింట్మెంట్ తీసుకోని రావాల్సిందిగా కోరుతున్నాం.అపాయింట్మెంట్ కొరకు 040-68334455 ని సంప్రదించండి.ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ హెడ్ సంగీత మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!
- నిరుద్యోగ యువతకు అలర్ట్..









