మీకు కోపం వస్తోందా? ----- అయితే ఏమి చెయ్యాలి?
- May 27, 2022
ప్రశ్న: నాకు ఈ మధ్య చిన్న విషయాలకి కూడా కోపం వస్తోంది. ఒకటి రెండు సార్లు చెప్పినా పని చెయ్యకపోతే పిల్లల పైన మా వారి పైన చికాకు కోపం వస్తున్నాయి. పని చేసే చోట కూడా నా కింద పని చేసే వాళ్ళని సరిగ్గా టైం కి రాకపొయినా, ప్రాజెక్ట్ టైం కి పూర్తి చెయ్యక పోయినా గట్టిగా మాట్లాడేస్తున్నా. ఆ టైం లో కోపం వఛ్చి ఏదైనా అన్నాతర్వాత చాలా బాధ గా అనిపిస్తుంది ఎందుకు అలా అన్నానా అని. ఇదివరకు ఇలాగా ఉండేదాన్ని కాదు. నా కోపం తగ్గడానికి ఏదైనా సలహా చెప్పగలరు.
జవాబు: మనం అనుకున్నది సరిగ్గా జరగనప్పుడు కోపం రావటం సహజం . మీకు కోపం తగ్గించుకోవాలి అన్న ఆలోచన రావటం చాలా సంతోషించ వలసిన విషయం. పని వత్తిడి ఎక్కువ అయ్యి కూడా మీకు చికాకు వస్తూ ఉండచ్చు.
- మీరు వర్కింగ్ అని చెప్పారు కాబట్టి పొద్దున్న కుదరక పోతే సాయంత్రం అయినా కాసేపు యోగ లేదా ఏదైనా వ్యాయామం చెయ్యండి.
- మీకు ఏదైనా హాబీ ఉంటె దానికి రోజూ కొంత సమయం కేటాయించండి.
- ముఖ్యం గా మీరు కోపం లో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండండి . కాసేపు ఆ ప్లేస్ నుండి దూరం గా వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యండి.
- మీరు కొంచం స్థిమిత పడ్డాక మీ వాళ్ళని కూర్చోపెట్టి మీకు కోపం తెప్పించిన విషయం గురించి వివరంగా చెప్పండి.
- ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఎవరి పని వాళ్ళకి క్లియర్ గా కేటాయించండి . వాళ్ల పనికి వాళ్లనే భాద్యత తీసుకునేటట్టు చెయ్యండి.
- మీరు ప్రతి విషయం లో కొంచం హాస్యాన్ని కూడా జోడించండి.
- కోపం వచ్చినందుకు మీరు మిమ్మల్ని దోషి లాగ అనుకోకండి, వేరేవాళ్లు మీలాగానే ఆలోచిస్తారని అనుకోవద్దు.
దీనిలో మీకు సరిపోయేవి ప్రయత్నించండి.
---- వాడ్రేవు ఉమాదేవి, సైకాలజీ కౌన్సెలర్, బెంగళూరు
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







