తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
- May 28, 2022
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. విదేశీ పర్యటన సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. యూకే, దావోస్‌లో పది రోజులపాటు పర్యటించిన కేటీఆర్.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రానికి కోట్ల విలువచేసే పెట్టుబడులను తీసుకొచ్చారు. యూకే, దావోస్ పర్యటనలో భాగంగా 45 వాణిజ్య, 4 రౌండ్ టేబుల్, 4 ప్యానెల్ సమావేశాల్లో పాల్గొన్నట్టు కేటీఆర్ ప్రకటించారు. మొత్తం తన పర్యటనలో 4వేల 200లకుపైగా పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
యూకె, దావోస్ పర్యటన విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన తన బృందానికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు కేటీఆర్ లండన్‌లో పర్యటించారు. లండన్‌లో భారత హైకమిషన్ సమావేశంతోపాటు ప్రవాస భారతీయులు, యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
లండన్ పర్యటన ముగించుకుని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో ఆయన సమావేశం అయ్యారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. పలు అంతర్జాతీయ కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







