అక్రమంగా పొగాకు విక్రయం: వలసదారుడికి 1000 ఒమన్ రియాల్స్ జరీమానా

- May 28, 2022 , by Maagulf
అక్రమంగా పొగాకు విక్రయం: వలసదారుడికి 1000 ఒమన్ రియాల్స్ జరీమానా

మస్కట్: నమిలే పొగాకుని విక్రయిస్తున్న వలసదారుడికి 1000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. సుల్తానేట్‌లో ఈ నమిలే పొగాకుపై నిషేధం వుంది. కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రుస్తాక్‌లోని కన్స్యుమర్ ప్రొటెక్షన్ డిపార్టుమెంట్ ఓ వలస కార్మికుడ్ని అరెస్టు చేసి, అతని నుంచి నమిలే పొగాకుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నమిలే పొగాకు వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వలసదారుడి నుంచి 52 పిల్స్ అఫ్దాల్, 6 పిల్స్ నిషేధిత రాయల్ టైప్ సిగరెట్లు, 100 బాక్సుల చనా టైప్ పొగాకు స్వాధీనం చేసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com