తక్కువ ట్రాఫిక్ సమస్యలున్న రాజధానుల్లో అబుదాబీకి అగ్రస్థానం

- May 28, 2022 , by Maagulf
తక్కువ ట్రాఫిక్ సమస్యలున్న రాజధానుల్లో అబుదాబీకి అగ్రస్థానం

యూఏఈ: 2021 టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్‌లో అబుదాబీ అగ్రస్థానం సంపాదించుకుంది. ప్రపంచంలో ట్రాఫిక్ సమస్యలు తక్కువగా వున్న రాజధాని నగరంగా అబుదాబీ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 57 దేశాల్లోని మొత్తం 416 నగరాల్లో ఈ సర్వే జరిగింది. అబుదాబీ 11 శాతం లెవల్ దక్కించుకుంది. జంక్షన్ల వద్ద, వివిధ సమయాల్లో ట్రాఫిక్ రద్దీ, ట్రాఫిక్ సమస్యలు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే చేశారు. ట్రాఫిక్ లైట్స్ సిస్టమ్ క్వాలిటీని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com