యూఏఈలో మూడు కొత్త మంకీపాక్స్ కేసులు
- May 30, 2022
అబుధాబి: యూఏఈలో మూడు కొత్త మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (MoHaP) ప్రకటించింది. కోవిడ్-19తో పోల్చితే మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. సాధారణంగా ఇది ఒకరి నుంచి మరోకరికి అంత సులువుగా వ్యాప్తి చెందదు. వ్యాధి సోకిన వ్యక్తి వాడిన వస్తువులు, దుస్తులు, సన్నిహిత సంబంధం ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ కడుపులోని బిడ్డకు కూడా సోకుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణాలు, సమూహాలలో సురక్షితంగా ఉండాలని, ఇతరుల వస్తువులపట్ల జాగ్రత్తలు పాటించాలని కోరారు. మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ వైద్య మార్గదర్శకాల ప్రకారం.. వ్యాధి సోకిన వారిని 21 రోజులపాటు ఆస్పత్రిలో ఒంటరిగా ఉంచడం, వారి కుటుంబ సభ్యులను కొన్ని రోజులపాటు హోంఐసోలేషన్ లో పెట్టడం లాంటి చర్యలతో వ్యాధి వ్యాప్తిని అరికడుతున్నామన్నారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లను నమ్మొద్దని ఆరోగ్య శాఖ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







