నకిలీ ప్రయాణ పత్రాల తయారీ..ఇద్దరు మహిళలకు జైలు శిక్ష
- May 30, 2022
బహ్రెయిన్: నకిలీ ప్రయాణ పత్రాలను తయారు చేసిన ఇద్దరు మహిళలకు కోర్టు జైలు శిక్ష విధించింది. రాజ్యంలో తమ బసను చట్టబద్ధం చేసేందుకు మహిళలు నకిలీ ప్రయాణ పత్రాలను సృష్టించారని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. 41 ఏళ్ల మహిళ రెండు వారాల్లో గడువు ముగిసే విజిట్ వీసాపై బహ్రెయిన్‌లో అడుగుపెట్టింది. అయితే ఆమె డిసెంబర్ 13వ తేదీన తిరిగి వెళ్లి రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చినట్లు నకిలీ పత్రాలను రూపొందించింది. పాస్‌పోర్ట్ లో ఆమె ప్రయాణాన్ని ధృవీకరించే అధికారిక ముద్రను కూడా ఫోర్జరీ చేసిందని అధికారులు కోర్టుకు తెలిపారు. అలాగే 45 ఏండ్ల మరో మహిళ జనవరిలో తన స్వదేశానికి తిరుగు ప్రయాణం కోసం విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా ఆమె దగ్గరున్న పత్రాలు నకిలీవిగా అధికారులు గుర్తించారు. ఎయిర్పోర్ట్ లో జారీ చేసిన సీల్స్ ను కూడా ఫోర్జరీ చేసిందని కోర్టుకు తెలిపారు. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు సహాయం చేసినట్లు పోలీసులు విచారణలో తేలిందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







