మందుపాతర పేలుడు కలకలం : చిత్తూరు
- April 07, 2016
చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో మందుపాతర పేలుడు కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఎదురుగా ఉన్న వాహనాల షెడ్‌లో ఈ పేలుడు సంభవించింది. పెద్దఎత్తున శబ్దం రావడంతోపాటు, కొంతసేపటి వరకు పొగ కమ్మేసింది. ఈ హఠాత్పారిణామంతో న్యాయవాదులు, కక్షిదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో న్యాయవాది గుమస్తా బాలాజి కుడికాలుకు దెబ్బతగిలింది. వెంటనే ఆయనను చిత్తూరు ఆస్పత్రికి, అక్కడి నుంచి వేలూరు సీఎంసీకి తరలించారు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్.. కోర్టుకు వచ్చి వెళ్లిన కొంతసేపటికే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో కోర్టులో హడావిడి కాస్త తక్కువగా ఉంది. కోర్టుల వద్ద కక్షిదారులు నిలబడి ఉన్నారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న చింటూ, వెంకటాచలపతి, శశిధర్ (మేయర్ దంపతుల హత్య కేసులోనూ నిందితులు) కేసు వాయిదాకు వచ్చారు. ఈ కేసును న్యాయమూర్తి ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. దీంతో వారంతా 11.40 గంటలకు బయటకు వెళ్లారు. ఆ తర్వాత 12 గంటలకు పేలుడు సంభవించింది. వాహనాల షెడ్‌లో న్యాయశాఖ ప్రొటోకాల్ వాహనం ఫుట్‌పాత్ కింద ఉంచిన మందుపాతర పేలినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో షెడ్‌వైపు వెళుతున్న బాలాజి గాయపడ్డారు. జిల్లా జడ్జి ఆనంద్, న్యాయమూర్తులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







