ప్రభుత్వ అనుమతి పొందిన Binance Bahrain సంస్థ

- May 31, 2022 , by Maagulf
ప్రభుత్వ అనుమతి పొందిన Binance Bahrain సంస్థ

మనామా: తొలిసారిగా బహ్రెయిన్ లో క్రిప్టో సేవలను అందించడానికి  Binance Baharain సంస్థ కు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ నుండి అధికార లైసెన్స్ లభించింది.ఇప్పటి నుంచి ఆ దేశంలో క్రిప్టో మార్పిడి సేవలు బహిరంగంగా లభిస్తాయి.సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ దేశ ప్రభుత్వం సంపూర్ణంగా స్వాగతించింది.  

కేవలం పైన పేర్కొన్నట్లుగా క్రిప్టో మార్పిడి సేవలు మాత్రమే కాకుండా క్రిప్టో ట్రేడింగ్ , పోర్టుఫోలియో మేనేజ్మెంట్ వంటి పలు క్రిప్టో ఆధారిత సేవలను సైతం బహ్రెయిన్ లో నిర్వహించేందుకు బ్యాంక్ అనుమతిచ్చింది. లైసెన్స్ పొందిన Binance సంస్థ ద్వారా కింద పేర్కొన్న నూతన సేవలు లభిస్తాయి. 

  • ఫ్యూచర్ స్పాట్ ట్రేడింగ్ (Future Spot Trading) 
  • ఇనిషియల్ కాయిన్ ట్రేడింగ్ (Initial Coin Trading) 
  • ఇనిషియల్ ఎక్స్చేంజ్ ఆఫరింగ్ (Initial Exchange Offering ) 
     
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com