ప్రబాస్ కోసం కెరీర్ పణంగా పెట్టిన సుజిత్: ఇప్పుడేం చేస్తున్నాడో.!

- May 31, 2022 , by Maagulf
ప్రబాస్ కోసం కెరీర్ పణంగా పెట్టిన సుజిత్: ఇప్పుడేం చేస్తున్నాడో.!

యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజిత్. ‘రన్ రాజా రన్’ సినిమాతో ఫస్ట్ హిట్టు కొట్టాడు. అంతవరకూ సీరియస్ రోల్స్‌కే పరిమితమైన హీరో శర్వానంద్‌లోని కామెడీ యాంగిల్‌ని పరిచయం చేసిన ఘనత సుజిత్‌కే దక్కుతుందని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు, వావ్ ఏం చేశాడురా.. అనే స్క్రీన్‌ప్లేని ఈ సినిమాలో చూపించాడు.

ఆధ్యంతం వినోదం పంచేలా కధనాన్ని నడిపించి, ఆడియన్స్‌ని కట్టి పడేశాడు ఈ సినిమాతో సుజిత్. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో రెండో సినిమాకే డార్లింగ్ ప్రబాస్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇంకేముంది త్వరలోనే స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి సుజిత్ చేరిపోతాడని అనుకున్నారంతా.

కానీ, అలా జరగలేదు. అప్పటికే రాజమౌళితో ‘బాహుబలి’కి కమిట్ అయ్యాడు ప్రబాస్. ఆ సినిమా పూర్తి చేస్తే కానీ, సుజిత్‌తో సినిమా చేయలేననడంతో ప్రబాస్ సినిమా కోసం సుజిత్ ఎదురు చూస్తూ వుండిపోయాడు. దాదాపు ఐదున్నరేళ్లు. ఆ లోపు బాహుబలి రావడం, ప్రబాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోవడంతో కథ అడ్డం తిరిగింది.

ప్రబాస్‌తో సుజిత్ ముందుగా అనుకున్న స్టోరీని తికమక చేసి, బాహుబలి స్టార్‌డమ్‌ని క్యాచ్ చేసేలా కథలో మార్పులు చేర్పులు చేయడంతో, అసలు ఫ్లేవర్ మిస్ అయిపోయింది. దాంతో ‘సాహో’ రిజల్ట్ ఏమయ్యిందో అందరికీ తెలిసిందే.

అలా ప్రబాస్ సినిమా కోసం తన కెరీర్‌నే పణంగా పెట్టేశాడు సుజిత్. ఆ గ్యాప్‌లో శర్వానంద్‌లాంటి చిన్న హీరోలతో మూడు నాలుగు చిన్న సినిమాలు చేసేసుకున్నా ఇండస్ర్టీ టాక్‌లో నిలిచేవాడు. ‘సాహో’ సినిమాతో సుజిత్ అడ్రస్ గల్లంతైపోయింది. ఆ మధ్య చిరంజీవికి ఓ స్టోరీ చెప్పాడన్నారు. కానీ, దానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదింతవరకూ. పాపం బోలెడంత ఫ్యూచర్ వున్న సుజిత్ కెరీర్ అలా అటకెక్కేసింది మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com