భారత్–బంగ్లాదేశ్ మధ్య ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ రైలు ప్రారంభం

- June 01, 2022 , by Maagulf
భారత్–బంగ్లాదేశ్ మధ్య ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ రైలు ప్రారంభం

భారత్–బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తూ..రెండు దేశాల మధ్య మరో కీలక అడుగు పడింది. భారత్‌లోని పశ్చిమబెంగాల్‌లోని న్యూ‌ జలపాయ్‌గురి..నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకా కంటోన్మెంట్ ఏరియాను కలుపుతూ ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ (ప్రజారవాణా) రైలు ప్రారంభం అయింది. బుధవారం భారత రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్..బంగ్లాదేశ్ మంత్రి మహ్మద్ నూరుల్ ఇస్లాం సుజోన్‌లు బుధవారం ఈ ప్రత్యేక రైలును ప్రారంభించారు.ఈమేరకు బెంగాల్‌లోని న్యూ జలపాయ్‌గురి రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమాలో ఇరు దేశాల మంత్రులు పాల్గొన్నారు.న్యూ జలపాయ్‌గురి–ఢాకా కంటోన్మెంట్ మధ్య..బుధ, ఆదివారాల్లో ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.

కాగా, ఇప్పటికే భారత్–బంగ్లాదేశ్ మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉండగా..బుధవారం మరో ప్రత్యేక రైలు ఇరుదేశాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకా వరకు మైత్రీ రైలు, కోల్‌కతా నుంచి ఖుల్నా వరకు బంధన్ ఎక్స్ప్రెస్ అనే రెండు రైళ్లు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ భారత్‌లో 69 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లో 526 కిలోమీటర్లు ప్రయాణించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com